ఆటోడ్రైవర్లకు ఉచితంగా టీకా

71

హైరిస్క్ గ్రూపులకు చెందిన ఆటో, క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు జి.హెచ్.యం.సి పరిధిలో 10 సెంటర్ల ద్వారా 20 రోజుల పాటు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా 2 లక్షలకు పైగా వ్యాక్సినేషన్ ను అందించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం క్యాబ్, ఆటో, వ్యాక్సినేషన్ సెంటర్ ను తనిఖీ చేశారు. లైసెన్స్ కలిగిన డ్రైవర్లు రవాణా శాఖ వెబ్ సైట్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు ప్రధాన కార్యదర్శి కి వివరించారు. వారి మోబైల్ కు మెసేజ్ వస్తుందని, మెసేజ్ వచ్చిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్ సెంటర్ లో అనమతినిస్తున్నమన్నారు. వ్యాక్సినేషన్ సెంటర్లలో కొవిన్ పోర్టల్ లో డ్రైవర్ల రిజిస్ట్రేషన్ చేస్తారని, నేరుగా వచ్చే వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం లేదన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం రవాణాశాఖ చేపట్టిన సదుపాయాల పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారిని అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here