అమరావతి భూముల విచారణలో స్పీడ్

Speed ​​at Amirvati Lands Insider Trading CID Inquiry

అమరావతి భూముల కొనుగోలులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఏపీలో రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే . ఇక ఈ కేసులో  సీఐడీ విచారణలో  స్పీడ్ పెరిగింది. ఇప్పటికే మాజీ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, నారాయణపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంతం ఇక్కడే వస్తుందని తెలిసి తెల్లరేషన్ కార్డు దారుల పేరుతో భూములు కొనుగోలు చేసి ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలపై సీఐడీ విచారిస్తోంది. ఇవాళ మరో ఏడుగురిపై కేసు నమోదు చేసింది.తెల్లరేషన్ కార్డుదారులు అబ్దుల్ జమేదార్, కొండలరావు పొలినేని, మండవ నాగమణి, మండవ అనురాధ, బొల్లినేని నరసింహరావు, భూక్యా నాగమణి సహా మరొకరిపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. వీరే గాక 791 మంది తెల్లరేషన్ కార్డుదారుల పేరుతో వేల ఎకరాల భూములను కొనుగోలు చేశారని సీఐడీ ఆధారాలు సేకరించింది.అమరావతి రాజధాని ప్రాంతంలో దళితుల నుంచి మాజీ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, పీ నారాయణ బలవంతంగా భూములు కొనుగోలు చేశారని సీఐడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. దళిత మహిళల నుంచి భూములు కొనుగోలు చేశారని ఎఫ్ఐఆర్‌లో సీఐడీ పేర్కొంది. అయితే వారు ఇష్టంతో కాకుండా బలవంతంగా భూములు కొనుగోలు చేశారని వివరించింది.మాజీ మంత్రులు పుల్లారావు, నారాయణపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వారిద్దరూ నేరపూరిత కుట్ర చేశారని, మోసం చేశారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు. ల్యాండ్ పూలింగ్‌పై సీఐడీ విచారణ కొనసాగుతోంది.

Speed ​​at Amirvati Lands Insider Trading CID Inquiry, amaravati lands, insider trading , CID, Inquiry, cases filed , criminal cases , CID FIR

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article