జూన్ మధ్యలో స్పుత్నిక్ టీకా

SPUTHNIK VACCINE WILL RELEASE IN MID JUNE, ANNOUNCED BY DR REDDY LABS. AS OF NOW, VACCINE PRICE IS RS. 948+ GST. ONCE LOCAL SUPPLY BEGINS, PRICE MAY COME DOWN. THE COMPANY IS HAVING ALMOST 25 CRORES DOSES.

స్పుత్నిక్ టీకా జూన్ మధ్యలో అందుబాటులోకి వచ్చే అవకాశముందని డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ టీకాను మార్కెట్లో విడుదల చేసేందుకు అవసరమయ్యే భాగస్వామ్యాలను నెలకొల్పేందుకు డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగాలతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ఈ టీకా ధర 948 + 5% జీఎస్టీగా నిర్ణయించారు. స్థానిక సరఫరా ప్రారంభమైనప్పుడు రేటు తగ్గే అవకాశముంది. మే 14 న డాక్టర్ రెడ్డీస్ తన కోల్డ్ స్టోరేజ్ లాజిస్టికల్ ఏర్పాట్లను పరీక్షించడానికి హైదరాబాద్‌లో సాఫ్ట్ పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాబోయే వారాల్లో ఈ పైలట్ దశను వేగవంతం చేసి ఇతర నగరాలకు విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. అయితే, తమ వద్ద ప్రస్తుతం 25 కోట్ల మందికి సరిపడా టీకాలున్నాయని సంస్థ వెల్లడించింది.

SourceTSNEWS
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article