త్వరలో 25 లక్షల స్పుత్నిక్‌ – వి టీకాలు

128

భారత్‌లో కరోనా మూడో టీకా స్పుత్నిక్‌ – వి అందుబాటులోకి వచ్చింది. రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఉత్పత్తి చేసి పంపిణీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొంది. వచ్చే 10 నెలల్లో 25 లక్షల డోసుల్ని అందుబాటులోకి తెస్తామని డాక్టర్‌ రెడ్డీస్‌ ఏపీఐ & సర్వీసెస్‌ విభాగం సీఈఓ దీపక్‌ సప్రా తెలిపారు. ప్రస్తుతం ఈ టీకా ఒక్కో డోసును జీఎస్టీతో కలుపుకొని ₹ 995 గా నిర్ణయించారు. ఐతే, భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత ధర మారుతుందని స్పష్టంచేశారు. వివిధ వేరియంట్లపై వ్యాక్సిన్ సామర్థ్య నిర్ధారణ కోసం ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఫలితాలు జూన్లో వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here