ఎమ్మెల్యే బైరెడ్డి కి ఒక్కరోజు భార్య అయినా చాలు

SRIREDDY HOT COMMENTS ON BYREDDY SIDDARTH REDDY

టాలీవుడ్ లో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన  శ్రీరెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఫిల్మ్ ఛాంబర్ ఎదుటే టాప్ లెస్ గా నిరసన వ్యక్తం చేసిన అనంతరం తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. టాలీవుడ్ పెద్దలను టార్గెట్ గా చేసుకుని సంచలన ప్రకటనలు, వ్యాఖ్యలు చేస్తూ వివాదాలను రేకెత్తిస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పైనా ఘాటు విమర్శలు చేయడానికి ఏ మాత్రం సంకోచించని శ్రీరెడ్డి.. ఈ సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కన్నేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై తన ప్రేమను వ్యక్తం చేశారు.

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఒక్కరోజు భార్యగా ఉన్నా చాలని, ఆ తరువాత చనిపోయినా ఫర్వాలేదంటూ ఫేస్ బుక్ అకౌంట్ లో శ్రీరెడ్డి చేసిన ఓ పోస్ట్.. విపరీతంగా వైరలైంది. వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని షేక్ చేసి పడేస్తోంది. దీనిపై వైసీపీ సోషల్ మీడియా విభాగం నాయకులు పెద్ద ఎత్తున ఆమెను ట్రోల్ చేస్తున్నారు. తమ నాయకుడిపై ప్రేమను వ్యక్తం చేయడాన్ని పలువురు నాయకులు స్వాగతిస్తుండగా.. మరి కొందరు ఆయనను వదిలేయ్ తల్లో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బైరెడ్డికి రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందని, దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించొద్దని చెబుతున్నారు.

tags : srireddy sensation, ysrcpmla,  baireddy siddharth reddy,

జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరనున్న చిరంజీవి  బంధువు

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *