టెన్త్ మెమో పోయిందా? ఇంకేం బాధలేదు

SSC Marks Memo will Digitized Soon

జీవితంలో మొదటి మెట్టు టెన్త్ మెమో. అన్ని అవసరాలకు టెన్త్ మెమో ముడిపడి ఉంటుంది. ఇక ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే టెన్త్ మెమో లేకపోతే ఆర్టీఏ కార్యాలయం గడపకూడ తొక్కనివ్వట్లేదు. మరి అలాంటి టెన్త్ మెమో మిస్ అయితే పరిస్థితి ఏంటి? ఒకవేళ పోయిన టెన్త్ మెమో కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగితిరిగి అలసి ఉన్నారా? అయితే అలాంటి వారికి తీపి కబురు అందనుంది. తొందర్లోనే టెన్త్ మెమోలు ఆన్లైన్ లో పెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతానికి 2014 నుండి మెమోలు ఆన్లైన్ లో పెడుతున్నారు. కాగా 1958వ సంవత్సరం నాటి నుంచీ ఉన్న అన్ని రిజిస్టర్లను డిజిటలైజేషన్ చేయనున్నారు. ఏ ఏడాదికా ఏడాది వారీగా, జిల్లాల వారీగా వివరాలను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. అందులో మెమోలతోపాటు స్టూడెంట్లకు సంబంధించిన ఇతర వివరాలు ఉంటాయి. హాల్ టికెట్ నంబర్​ఎంటర్​ చేస్తే క్షణాల్లో వివరాలన్నీ కనిపిస్తాయి.

SSC Marks Memo will Digitized Soon,All Student Certificates In Online,SSC Marks Memo will In Online

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article