ఢిల్లీలో ప్రధానితో స్టాలిన్ సమావేశం

122

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానితో సమావేశం సంతృప్తికరంగా సాగిందని అనంతరం స్టాలిన్ వెల్లడించారు. తమిళనాడు అభివృద్ధికి సాయపడతామని, కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై తనను ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని మోదీ చెప్పారని స్టాలిన్ వివరించారు. అంతేకాకుండా, జాతీయస్థాయి వైద్య ప్రవేశాల అర్హత పరీక్ష నీట్, నూతన విద్యావిధానాలను ఎత్తివేయాలని ప్రధానిని కోరినట్టు వెల్లడించారు. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ అంశాన్ని కూడా ప్రధాని వద్ద ప్రస్తావించినట్టు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here