ఎట్టిపరిస్థితుల్లోనూ చట్టాన్ని స్వాగతించం

24
State Electricity Jac Opposit New Power Bill
State Electricity Jac Opposit New Power Bill

State Electricity Jac Opposit New Power Bill

కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ధర్నా చేసింది. శివాజీ, అంజయ్యలతోపాటు విద్యుత్ కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం కార్పొరేట్ లకు మాత్రమె ఈ  చట్టం ఉపయోగపడుతుంది. విద్యుత్ సంస్థను ప్రైవేట్ చేసేందుకు మాత్రమే ఇది పనిచేస్తుంది. ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎంతో చరిత్ర ఉన్న విద్యుత్ ను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ఈ చట్టం తెస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజల బాగోగులు తెలుసు కాబట్టి ముందు నుండే వ్యతిరేకించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చట్టాన్ని స్వాగతించం. ఈ చట్టం తో ప్రజలకు, ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుంది. దేశవ్యాప్తంగా భారీ ఉద్యమం  మొదలవుతుంది, దానికి మా పూర్తి మద్దతు ఉంటుంది.రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ప్రజాస్వామ్య దేశం లో ప్రజలకు ఉపయోగపడే చట్టం కావాలి. రైతును రాజు చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగానే ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు నిర్మాణం చేపట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలను సంప్రదించి చట్టం చెయ్యాలి. ఈ చట్టం ఉపసంహరణ చేసే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది’’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here