State Government stressing for Muslim reservation
.. ఎంపీలకు కేసీఆర్ సూచన
కేసీఆర్ అనుకున్నది సమయానుకూలంగా తెరమీదకు తీసుకు వస్తారు. ముస్లీంలకు రిజర్వేషన్ అంశం పై ఇప్పుడు కేంద్రం లో ఈబీసీ బిల్లు ఆమోదం పొందనున్న నేపధ్యంలో కేసీఆర్ మెలిక పెట్టారు. ముస్లిం లకు 12శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన కోరారు. ఇక ఈ నేపధ్యంలో టీఆర్ ఎస్ పార్లమెంట్ సభ్యులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు . కేంద్రం పై ఈ విహ్స్యంలో ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. దీని వల్ల దేశంలోని ముస్లిం మైనార్టీలకు దగ్గర కావచ్చన్న వ్యూహంలో ఆయన ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు మెలిక పెట్టారు. ఈ బిల్లుకు సవరణలు కోరాలని ఆయన తమ పార్టీ పార్లమెంటు సభ్యులకు మార్గనిర్దేశం చేశారు.
ముస్లిం రిజర్వేషన్లపై కేంద్రం మీద ఒత్తిడి తేవాలని ఆయన వారికి సూచించారు. ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన పార్టీ ఎంపీలను ఆదేశించారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఈబీసీలకు10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యంగ సవరణ బిల్లును కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేసీఆర్ తమ పార్టీ పార్లమెంటు సభ్యులకు తగిన సూచనలు ఇచ్చారు. ఈబీసి బిల్లుతో పాటు ముస్లిం రిజర్వేషన్ల బిల్లును చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన ఎంపీలకు సూచించారు.