నామినేటెడ్ ఎమ్మెల్యేగా మరో సారి స్టీఫెన్ సన్ కే అవకాశం

Stephen son will be Nominated MLA

తెలంగాణా లో మంత్రి వర్గ విస్తరణ జరగనున్న నేపధ్యంలో అలాగీ అసెంబ్లీ సమావేశం కానున్న నేపధ్యంలో కేసీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం నామినేటెడ్ ఎమ్మెల్యే గురించి నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రజలచేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలతో పాటు గవర్నర్ చేత నామినేట్ చేయబడే ఆంగ్లో ఇండియన్ సభ్యుడి నియామకం కూడా చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఇద్దరే మంత్రులు ఉన్న మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడిగా మరోసారి ఎల్విస్ స్టీఫెన్ సన్ ను నియమిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. క్రిస్టియన్ మతానికి చెందిన ఆంగ్లో ఇండియన్ స్టీఫెన్ సన్ కు ఈ పదవి వరించడం ఇది రెండోసారి.
స్టీపెన్ సన్ నియామకానికి సంబంధించి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం గవర్నర్ ప్రతిపాదనలు పంపింది. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే ఆయన నియామకానికి సంబంధించి గెజిట్ విడుదల అవుతుంది.
సాధారణంగా మొదట ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత మెల్లగా నామినేటెడ్ సభ్యుడి నియామకం జరుగుతుంది. అయితే దీనివల్ల నామినేటెడ్ మెంబర్ ఇతర సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయడం సాధ్యపడదు. ఫలితంగా విలువైన పదవీ కాలాన్ని కోల్పోతారు. ఈ సమస్యను నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం తన మొదటి కేబినెట్ సమావేశంలోనే అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడి నియామకానికి నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం నామినేటెడ్ ఎమ్మెల్యేగా నియమించబడుతున్న స్టీపెన్ సన్ తెలంగాణ ప్రజలందరికి సుపరిచితమే. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఓటుకు నోటు కేసులో ఆయన పేరరు మారుమోగింది. ఈ సమయంలో స్టీపెన్ సన్ టీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచి కేసీఆర్ దృష్టిలో పడ్డారు. దీంతో మరోసారి ఆయనకు ఈ అవకాశం లభించింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article