అధికారుల నిర్లక్ష్యంతో పలు గ్రామాల్లో నిలిచిన పోలింగ్

Polling was stopped in villages

తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. చాలా జాగ్రత్తగా పోలింగ్ నిర్వహించవలసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాట్సప్‌లో వచ్చిన రిజర్వేషన్ల జాబితా సందేశం ఓ గ్రామ పంచాయతీలో రెండు వార్డు సభ్యులకు ఎన్నికలు నిలిపేలా చేసింది. రెవెన్యూ సరిహద్దు వివాదం కారణంగా మరో రెండు పంచాయతీల ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు. అధికారుల తప్పిదం వల్ల నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు వివాదంగా మారాయి. ఇక తాజాగా బ్యాలెట్ పేపర్ పై సర్పంచ్ గా పోటీ లో ఉన్న ఆరుగురు అభ్యర్థులకు గాను ఐదుగురు అభ్యర్థుల గుర్తులే ముద్రించి ఉండడంతో మంచిర్యాల జిల్లాలోని ఒక గ్రామంలో పోలింగ్ నిలిచిపోయింది. మంచిర్యాల జిల్లా జజ్జర్వెల్లి గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పోలింగ్ నిలిచిపోయింది. కన్నెపల్లి మండలం జజ్జర్వెల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆరుగురు సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉంటే బ్యాలెట్ పేపర్‌పై ఐదుగురు అభ్యర్థుల ఎన్నికల గుర్తులు మాత్రమే ముద్రించి ఉన్నాయి. ఒక అభ్యర్థి ఎన్నికల గుర్తు బ్యాలెట్ పేపర్‌పై లేకపోవడంతో అర్ధంతరంగా పోలింగ్ నిలిపివేశారు. అధికారుల తీరుతో అభ్యర్థులతోపాటు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article