Story released ?
థెరి(తెలుగులో పోలీస్), మెర్సల్(అదిరింది) చిత్రాల తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ హ్యాట్రిక్ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా కథ లీకైందంటూ వార్తలు వినపడుతున్నాయి. విజయ్ కోచ్‌గా ఉండే టీంలో కీలక సభ్యులు హత్యకు గురవుతుంటారు. దానికి విజయ్ కారణమని పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. అయితే హత్యా నేరం నుండి అతనెలా తప్పించుకున్నాడనేదే కథ అని టాక్. కల్పాతి అఘోరం నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
For More Click Here
More Latest Interesting news