ముద్దు కోసం వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు

54
STUDENT IN TROUBLE FOR KISS
STUDENT IN TROUBLE FOR KISS

STUDENT IN TROUBLE FOR KISS

  • ప్రియురాలి సవాల్ స్వీకరించి చిక్కుల్లో పడ్డ యువకుడు
  • చెన్నైలో ఘటన

‘నేను పెట్టిన పందెలో గెలిచి చూపించు.. అప్పుడు నువ్వడిగిన ముద్దిస్తా’ అంటూ ప్రియురాలు విసిరిన సవాల్.. అతడిని చిక్కుల్లో నెట్టింది. ఆమె ఛాలెంజ్ స్వీకరించిన అతగాడు.. ప్రియురాలి ముద్దు కోసం ఆశపడి కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. తమిళనాడులోని పట్టాభిరామ్‌ తండురై గ్రామం పల్లవీధికి చెందిన శక్తివేల్‌ (22) అన్నాసాలైలోని ఐటీఐలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఐసీఐసీఐ బ్యాంక్‌ ట్రస్ట్‌ తరఫున ఉద్యోగ శిక్షణలో ఉండగా అక్కడే ఉన్న ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ క్రమంలో ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14న తనకు ఓ ముద్దు ఇవ్వమని కోరాడు. అయితే, అందుకు నిరాకరించిన ఆమె.. తాను పెట్టిన పందెంలో గెలిస్తే ముద్దు ఇస్తా అంటూ ఊరించింది. బురఖా వేసుకుని రాయపేట నుంచి మెరీనా బీచ్ వరకు రావాలని పేర్కొంది. పాపం ముద్దు కోసం అతడు సై అన్నాడు. అనంతరం బురఖా వేసుకుని ప్రియురాలి ఇంటికి వచ్చాడు. అక్కడి నుంచి ఆమెతో కలిసి మెరీనా బీచ్‌కు వెళ్లాడు. అయితే శక్తివేల్ నడక, వ్యవహారశైలి తేడాగా ఉండటంతో స్థానికులు అనుమానం వచ్చి నిలదీశారు. అతడు అమ్మాయి కాదు.. అబ్బాయి అని తెలుసుకుని చితకబాదారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు శక్తివేల్‌ను అరెస్టు చేసి విచారణ చేయగా.. పందెం, ముద్దు విషయం వెలుగులోకి వచ్చాయి.

NATIONAL NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here