గతంలో మిస్ అయిన కల్పన అనే విద్యార్థిని

Student was Missed in Past Her Name is Kalpana

యాదాద్రి జిల్లా బీబీనగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని హజీపూర్‌కు చెందిన శ్రావణి హత్యకేసు ఘటన గ్రామంలో విషాదం చోటు చేసుకొంది. శ్రావణి హత్య కేసును పరిశోధిస్తున్న పోలీసులకు సంచలన విషయాలు వెలుగు చూశాయి. నాలుగేళ్ల క్రితం కల్పన అనే విద్యార్థిని కూడ అదృశ్యమైంది. ఇప్పటికి కూడ ఆ బాలిక ఆచూకీ దొరకలేదు.

హజీపూర్‌కు చెందిన శ్రావణిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడి హత్య చేసి ఉంటారని పోలీసులు చెప్పారు. శ్రావణి కంటే నాలుగేళ్ల క్రితం కూడ కల్పన అనే విద్యార్థిని అదృశ్యమైందని గ్రామస్తులు గుర్తు చేసుకొన్నారు.ఇంతవరకు కూడ ఆమె ఆచూకీ తెలియదన్నారు. కల్పన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కల్పన ఆచూకీ ఎక్కడ ఉందో కనిపెట్టాలని కోరుతున్నారు. శ్రావణి హత్య కేసులో గ్రామానికి చెందిన కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే అమాయకులను వేధించకూడదని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article