వీధి రౌడీల్లా కొట్టుకున్న స్టూడెంట్స్ స్ట్రీట్ ఫైట్

STUDENTS FIGHTS IN STREET LIKE ROWDY’S

విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన వారు వీధి రౌడీల్లా మారారు. విచక్షణా రహితంగా కొట్లాటకు దిగారు. వెంబడించి మరీ ఒక విద్యార్థిని చావ చితగ్గొట్టారు. చిలుకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాఫల్ మండిలో 10వ తరగతి విద్యార్థులు స్ట్రీట్‌ ఫైట్‌కు దిగారు. మెడిబావి అమరావతి స్కూల్ విద్యార్థుల మధ్య వివాదం పెద్ద గొడవకు దారి తీసింది. బీదలబస్తీలో ఉండే శ్రీవాస్తవ్ అనే విద్యార్థి ఇంటి దగ్గరకు వచ్చిన తోటి విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టారు. శ్రీవాస్తవ్‌ను వెంబడించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అడ్డొచ్చిన అతని అమ్మానాన్న, తమ్మునితోపాటు.. బస్తీ వాసులను కూడా కొట్టినట్లు చిలుకలగూడ పోలీసులకు పిర్యాదు చేశారు. తనను చంపుతామని బెదిరిస్తున్నారని, తనను రక్షించాలని పోలీసులను కోరాడు శ్రీ వాస్తవ్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇగో కారణంగా విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 10వ తరగతికే విద్యార్థులు ఈ రేంజ్‌లో రెచ్చిపోవడం పేరెంట్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. బుద్ధిగా చదువుకోవాల్సిన విద్యార్థులు వీధిరౌడీల్లా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పించాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article