WHY :Suddenly KCR Going to Dubai
తెలంగాణా సీఎం కేసీఆర్ దుబాయ్ వెళ్లనున్నారు. అసలు ఆయన ఎప్పుడూ విదేశాలకు వెళ్ళటానికి ఇష్టపడరు. ముఖ్యమంత్రి హోదాలో ఒక్కసారి సింగపూర్ వెళ్ళొచ్చిన కేసీఆర్ సడన్ గా దుబాయ్ కి ఎందుకు వెళ్తున్నారు . అసలు విదీశీ పర్యటనలు అంటేనే ఇష్టపడని ఆయన ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు, మరో పక్క మంత్రి వర్గ ఏర్పాటును ఆపి ఎందుకు దుబాయ్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు అంటే అందుకు చాలా కారణాలున్నాయి.
ఇక అత్యధికంగా విదేశీ యాత్రలు చేసి దేశ ప్రధాని రికార్డు సృష్టిస్తే, అతి తక్కువ అంటే సింగపూర్ మినహా ముఖ్యమంత్రి హోదాలో ఏ దేశ పర్యటనకు వెళ్లని సీఎంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రికార్డు సృష్టించారు.మొదటి నుండి తన జీవిత కాలంలో ఎన్నడూ విదేశాలకు వెళ్లడానికి ఇష్టపడని ఆయన అప్పట్లో ఒకసారి రాష్ట్ర ప్రయోజనాల కోసం సింగపూర్ వెళ్ళాడు. తెలంగాణ ముఖ్యమంత్రి తొలి సారి 2014లో సింగపూర్ లో నిర్వహించిన ఐఐఎం అలుమ్ని అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఆ తరువాత చైనా, హాంకాంగ్‌లలో పర్యటించారు. అంతకు మించి మరే విదేశీ పర్యటనలకు వెళ్ళని కేసీఆర్ సడన్ గా దుబాయ్ కి వెళ్లనున్నారు.
ఆకస్మికంగా ఆదివారం కేసీఆర్ దుబాయ్ పర్యటనకు వెళుతున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత క్యాబినెట్ ఏర్పాటు ఉంటుంది అని ఆశావహ ఎమ్మెల్యేలు అంతా ఎదురుచూస్తున్న వేళ ఈ దుబాయ్ పర్యటన ఎందుకనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పటిన అనంతరం ఆయన చేస్తున్న రెండో విదీశీ పర్యటన ఇది కావటం విశేషం. ఇక ఆయన ఎందుకు దుబాయ్ కి వెళ్తున్నారు అంటే అందుకు కారణం లేకపోలేదు. తెలంగాణాలో రెండో దఫా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత తెలంగాణలో పెట్టుబడుల కోసం ఎన్నారైలను ఆకర్షించే పనిలో భాగం గా ఆయన దుబాయ్ వెళుతున్నారని తెలిసింది. అంతే కాదు ఉత్తర తెలంగాణలో అధికంగా ఉన్న గల్ఫ్ దేశాల వార్ కుటుంబీకులు గులాబీ పార్టీ కి ఓటు వేసి గెలిపించినందుకు కృతజ్ఞత తెలిపే క్రమంలో కూడా వెళ్తున్నారని టాక్ . ఇటీవల జరిగిన ఎన్నికలల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుని టీఆర్ఎస్ విజయంలో భాగం కావడానికి దుబాయ్ నుంచి ప్రత్యేకంగా వచ్చి ఓటు వేసిన తెలంగాణ ఎన్ఆర్ ఐలని మర్యాదపూర్వకంగా కలిసే ఉద్దేశంతోనే ఆయన దుబాయ్ వెళుతున్నట్టు తెలుస్తోంది. అయితే దుబాయ్ పర్యటనకు ముఖ్యమంత్రితో పాటు సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ఐఎఎస్‌లు అరవిందకుమార్, జయేష్ రంజన్ తదితరులు కూడా దుబాయ్ వెళ్లనున్నారు. మొత్తానికి కేసీఆర్ దుబాయ్ ట్రిప్ మతలబు ఇదేనా ? ఇంకా ఏమైనా ఉందా అని కూడా ఆలోచిస్తున్న వారు లేకపోలేదు.