పార్టీ మార్పుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి క్లారిటీ

Sudheer Reddy Clarity Changing in Party

తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల జంపింగ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఒక పక్క టిఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్ ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. ఇక దాని కోసం పెద్ద ఎత్తున పదవులను కూడా ఆఫర్ చేస్తుంది. అలాంటి తరుణంలో కొందరు సీనియర్ నాయకులు సైతం పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వనున్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. వారితో మాట్లాడి పార్టీ మారకుండా ఆపడానికి ప్రయత్నించి చేస్తుంది.

గ్రేటర్ హైదరాబాద్ ఎల్బినగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సుధీర్ రెడ్డి కూడా నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది. వీరి కోసం సుధీర్ రెడ్డి తో టిఆర్ఎస్ పార్టీ నేతలు మంతనాలు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే సుధీర్ రెడ్డి తన అనుచరులు, సన్నిహితుల దగ్గర పార్టీ మార్పు అంశంపై చర్చించినట్లుగా కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వార్తను సుదీర్ రెడ్డి ఖండించారు
అయితే ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్యే డి.సుధీర్ రెడ్డి ఖండించారు. తాను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని పార్టీ మారే ఛాన్సే లేదని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో గందరగోళం సృష్టించి తమవైపుకు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతుందని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.

Check out MS DHONI Signed Bat CLICK HERE

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article