డయాబెటిస్ పేషెంట్లకు కొవిడ్?

Sugar Patients, Heart Patients, Hyper Tension People.. Dont Worry About Covid. ICMR Released the FAQs for Patients with Hypertension, Diabetes and Heart Diseases in view of Coronavirus.

695
Hypertension, Diabetes and Heart Diseases in view of Coronavirus
Hypertension, Diabetes and Heart Diseases in view of Coronavirus

మధుమేహం, గుండె జబ్బులు, హైపర్ టెన్షన్ ఉన్నవారే ఎక్కువగా కొవిడ్ వల్ల మరణిస్తున్నారనే వార్తలు నిరాధారమైనవి. ఇవి ఉన్నవారికి కోవిడ్ సోకగానే మరణిస్తారనేది అపోహ మాత్రమే. కాబట్టి, ఇవి ఉన్నవారికి కరోనా సోకినా భయపడాల్సిన అవసరమే లేదు. దీనికి సంబంధించి ఐసీఎంఆర్ మంగళవారం ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది.

డయాబెటీస్, గుండె జబ్బులు, హైపర్ టెన్షన్ ఉన్నవారు కరోనా గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఇవి ఉన్నవారు కొవిడ్ సోకగానే మరణిస్తారనేది కరెక్టు కాదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. వీరికి కొవిడ్ సోకినా దాదాపు ఎనభై శాతం మందికి ఎలాంటి ప్రమాదం ఉండదని తెలియజేసింది. జ్వరం, గొంతునొప్పి, జలుబు వంటివి వచ్చినా పూర్తి స్థాయిలో కోలుకుంటారని ప్రకటించింది. కాకపోతే, డయాబెటిస్ ఉన్న వారిలో కొందరు, రక్తపోటు మరియు గుండె జబ్బులతో సహా గుండె వైఫల్యం (బలహీనమైన గుండె) ఉన్నవారిలో లక్షణాలు కాస్త తీవ్రంగా ఉంటాయి. దీంతో, సమస్యలు పెరుగుతాయి. కాబట్టి, ఇలాంటి వారి పట్ల కాస్త అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

డయాబెటిస్ ఉంటే ప్రమాదమా?
మధుమేహం అధికంగా ఉంటే సహజంగానే ఇన్ఫెక్షన్ సోకే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి, కరోనా వచ్చినా దిగులు పడక్కర్లేదు. మంచి ఆహారం తీసుకుని క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అదే విధంగా, క్రమం తప్పకుండా మందులు వాడాలి. షుగర్ మోతాదును క్రమం తప్పకుండా తెలుసుకుంటూ ఉండి మధుమేహాన్ని నియంత్రించుకోవాలి. డయాబెటిస్ పేషెంట్లు తరుచుగా బ్లడ్ గూకోజ్ గురించి తెలుసుకోవాలి. ఇన్సులిన్, తరుచూ స్వల్ప భోజనం, తగినంత ద్రవ పదార్థాల్ని తప్పకుండా తీసుకోవాలి.

మందుల్ని తప్పకుండా వాడాలి
స్వల్పకాలిక కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ.. మందుల్ని వాడటం మాత్రం నిలిపివేయకూడదు. డాక్టర్ చెప్పేంత వరకూ వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. ఒకవేళ మీరు డాక్టర్ ను కలిసే అవకాశం లేకపోతే గనక.. బీపీ, మధుమేహం, గుండె సమస్యకు సంబంధించిన మందుల్ని మాత్రం వాడుతూనే ఉండాలి. కొలెస్ట్రాల్ నియంత్రణకు అవసరమయ్యే మందుల్ని తప్పకుండా తీసుకోవాలి.

బీపీ మందుల వల్ల కొవిడ్ పెరుగుతుందా?
బీపీ మందుల్ని వాడటం వల్ల కొవిడ్ తీవ్రత పెరుగుతుందనే విషయం ఎక్కడా నిరూపితం కాలేదు. కొవిడ్ వచ్చినప్పటికీ, ఏస్ ఇన్ హిబిటర్లు (రామిప్రిల్, ఎనాలాప్రిల్ వంటివి) మరియు యాంజియోటెన్షన్ రిసెప్టర్ బ్లాకర్ల మందుల (లాసార్టాన్, టెల్మిసార్టన్ వంటివి) ను
నిస్సందేహంగా వాడొచ్చు. గుండె సక్రమంగా పని చేసేందుకు ఈ మందులు చక్కగా పని చేస్తాయి. కాబట్టి, వీటి వాడకం నిలిపివేయకూడదు.

ఐబ్రూఫిన్ వద్దు..
మధుమేహం, గుండె జబ్బు, హైపర్ టెన్షన్ ఉన్నవారికి కరోనా వస్తే.. ఐబ్రూఫిన్ వంటి పెయిన్ కిల్లర్లను వాడకపోవడమే మంచిదని ఐసీఎంఆర్ చెబుతున్నది. ఇటువంటి మందుల్ని వాడటం వల్ల గుండె రోగులకు హానికరం. కిడ్నీలు పాడయ్యే ప్రమాదముంది. కాబట్టి, డాక్టర్లు చెబితేనే ఈ మందుల్ని వాడండి. లేకపోతే ప్యారసిటమాల్ వంటివి మందుల్ని వాడితే ఉత్తమం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here