ప్రగతి భవన్ వద్ద పెట్రోల్ బాటిల్ తో హంగామా చేసిన వ్యక్తి

Suicide Attempt At Pragati Bhawan With Petrol Bottle
తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ వద్ద ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్ తో హల్ చల్ చేశారు.  తన సమస్యను ఎవరూ పట్టించుకోలేదని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్య చేసుకుంటానని హంగామా సృష్టించాడు .  ప్రగతి భవన్ ముందు పెట్రోల్ పార్టీతో కలకలం సృష్టించిన  మంచిర్యాల జిల్లా కు చెందిన రవీందర్ అనే వ్యక్తి  తన సమస్య పరిష్కారం  కావటం లేదని  సీఎం క్యాంప్ ఆఫీస్ ముందే ఆత్మహత్యా యత్నం చెయ్యాలనుకుని పెట్రోల్ బాటిల్ తో అక్కడికి వెళ్ళాడు . అతను   2001 నుండి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా  పనిచేస్తున్న  రవీందర్  సీఎం కేసీఆర్ పై అభిమానంతో  ఆయనకు గుడి కూడా కట్టాడు.  అక్కడ ఆయన ఒకవైపు నెట్వర్క్ నడుపుతున్నాడు.  అయితే దానిని కొందరు వ్యక్తులు ఆక్రమించారని ఆవేదన చెందిన రవీందర్ ఈ విషయంపై ఎంపీ, ఎమ్మెల్యేకు సైతం  తన గోడు వెళ్లబోసుకున్నానని  చెప్పుకొచ్చారు. తన కేబుల్  టీవీ నెట్వర్క్ ని ఆక్రమించింది  ఓ రౌడీ షీటర్ అని చెబుతున్న ఆయన  పోలీసులకు ఫిర్యాదు చేసిన  పట్టించుకోవడంలేదని  పేర్కొన్నారు.  దీంతో ప్రగతి భవన్ కు వచ్చి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవాలని భావించానని ఆయన చెప్పుకొచ్చారు.  ప్రగతి భవన్ ముందు పెట్రోల్ బాటిల్ తో కనిపించిన వ్యక్తి పై  అప్రమత్తమైన సెక్యూరిటీ  పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు  చేయాగా పోలీసులు  రవీందర్ ను అరెస్ట్ చేశారు.

tags :  manchiryal, ravinder, petrol bottle, suicide attempt, telangana cm, kcr camp office, pragathi bhavan

http://tsnews.tv/harish-rao-simplicity/
http://tsnews.tv/acb-attacks-on-jc-diwakar-reddy-pa-suresh-reddy-house/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *