ములుగు జిల్లాలో ఎస్సై సూసైడ్ చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని వాజేడు ఎస్సై హరీష్.. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది.
ప్రేమించిన యువతితో వివాహం జరుగడం లేదనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
ఆదివారం బందోబస్తు తరువాత.. వాజేడు ఎస్సై రాత్రి సమయంలో యువతితో కలిసి హరిత రిసార్ట్‌కు వెళ్లారు. అయితే ఎస్సై ఆత్మహత్య చేసుకున్న సమయంలో యువతి అదే గదిలో ఉంది. వెంటనే ఆ యువతి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న ఎస్సై స్వగ్రామం జయంశంకర్ భుపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వర్ల గ్రామం. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వరుసగా…!
కొద్దిరోజుల క్రితం వాజేడు పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు మావోస్టులు హతమార్చారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా రాయపోలులో లేడి కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైంది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు ఎస్సై హరీష్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. వ్యక్తిగత కారణాలు కారణంగా ఎస్సై సూసైడ్ చేసుకున్నారా లేక ఇంకేదన్న కారణం ఉందా.. అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
అయితే, తాజాగా ఎస్సై హరీష్ ఆత్మహత్యపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంట్లో చెప్పిన తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో.. తనకు ఇష్టం లేకుండా పెళ్లి సంబంధాలు చూడడంతో మనస్తాపానికి గురై.. ఈ తరుణంలోనే యువతితో రిసార్ట్ కి వెళ్లారు. మ్యారేజ్ వ్యవహారంలోనే ఎస్సై సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్ఐ హరీశ్‌కు 10 రోజుల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. సొంత గ్రామంలో కొత్త ఇళ్ళు నిర్మాణం కూడా చేపట్టారు.
సోమవారం ఉదయం నుంచి ఎవరు ఫోన్ చేసిన ఆయన అందుబాటులోకి రాలేదు. రిసార్ట్స్ సిబ్బంది ఎన్ని సార్లు డోర్ కొట్టినా తలుపు తెరవలేదు. దీంతో సోమవారం ఉదయం వాజేడు పోలీసులకు సిబ్బంది సమాచారం అందించారు. పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకున్న తర్వాత రిసార్ట్స్ సిబ్బంది డోర్ పగులగొట్టి చూడగా ఎస్ఐ విగతజీవిగా పడి ఉన్నారు.