జార్ఖండ్ రాష్ట్రము బొకారో జిల్లా కు చెందిన విష్ణు మహతు ( 20 ) ఆనే యువకుడు బెట్టింగులు వ్యసనంగా మారడంతో అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలి పనులు చేసుకుంటూ తోటి మిత్రులతో మండల కేంద్రంలో నివసిస్తున్నాడు. రూమ్ నుండి ఎవరికీ చెప్పకుండా ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం పూట బయటికి వెళ్లాడు.
ఆచూకీ కోసం రూమ్ సభ్యులు వెతకగా అయ్యప్ప టెంపుల్ పక్కన గల అటవీ ప్రాంతంలో ఒక చెట్టుకి ఉరి వేసుకొని వేలాడుతూ 21వ తేదీన కనబడ్డాడు. మిత్రుడు ధనేశ్వర్ మహతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని అతని స్వగ్రామమైన అలోకడి గ్రామం బారాషాబాద్ మండలంబొకారో జిల్లా జార్ఖండ్ రాష్ట్రానికి తరలించారు.