మహేశ్-సుక్కు సినిమా ఆగిపోయింది

SUKKU, MAHESH MOVIE CANCEL

  • కథాపరంగా ఏకాభిప్రాయం కుదరకే అన్న ప్రిన్స్
  • తమ సినిమా క్యాన్సిల్ అయిందని ఫేస్ బుక్ లో వెల్లడించిన మహేశ్ బాబు

శివరాత్రి సందర్భంగా టాలీవుడ్ లో అనూహ్యంగా రెండు ప్రకటనలు వెలువడ్డాయి. అందులో ఒకటి బన్నీ 20వ సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతందున్న విషయం కాగా.. రెండోది మహేశ్ బాబు-సుకుమార్ సినిమా గురించి. వీరిద్దరి సినిమా రద్దయిందంటూ అకస్మాత్తుగా వచ్చిన వార్త అందరినీ అయోమయానికి గురిచేసింది. కొన్ని కారణాలరీత్యా సుకుమార్ తో తన సినిమా క్యాన్సిల్ అయిదంటూ ప్రిన్స్ మహేశ్ బాబే స్వయంగా ప్రకటించారు. వాస్తవానికి సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతోందంటూ సోమవారం ప్రకటన వెలువడింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బన్నీ సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా ఉండొచ్చని అంచనా వేశారు. ఈలోగా సుక్కు-మహేశ్ సినిమా కూడా పూర్తయిపోతుందని భావించారు. అయితే, అనూహ్యంగా తమ సినిమా క్యాన్సిల్ అయిందనే వార్త మహేశ్ బాబు నుంచే రావడంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సుకుమార్ తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉంటుందని గతంలోనే ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించి సుకుమార్ కథపై కసరత్తు కూడా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రద్దయింది. ఈ విషయాన్ని మహేశ్ బాబు తన ఫేస్ బుక్ అఫీషియల్ పేజీలో నిర్ధారణ చేశాడు. “సృజనాత్మక విభేదాల కారణంగా సుకుమార్ తో నేను చేయాల్సిన సినిమా కార్యరూపం దాల్చబోవడం లేదు. ఆయన కొత్త సినిమా ప్రకటన సందర్భంగా నా శుభాకాంక్షలు. ఆయనలోని గొప్ప ఫిల్మ్ మేకర్ ని ఎల్లప్పుడూ గౌరవిస్తాను. 1 నేనొక్కడినే చిరకాలం కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోతుంది. ఆ సినిమా చేస్తున్న సమయంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. మీ కొత్త సినిమాకు శుభాకాంక్షలు సర్” అని మహేశ్ పేర్కొన్నాడు. కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే ఈ సినిమా రద్దయిందన్న విషయం తెలుస్తోంది. రజాకర్ల నేపథ్యంలో ఒకటి, ఎర్ర చందనం స్మగ్లర్ల బ్యాక్ డ్రాప్ లో మరో కథను మహేశ్ కు వినిపించినా.. ఏదీ నచ్చలేదని సమచారం. అందువల్లే ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. (మళ్లీ సుక్కు-బన్నీ కాంబినేషన్)

TELUGU CINEMA

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article