Sukumar Plan change on Nithin
దర్శకుడిగా భారీ చిత్రాలను తెరకెక్కిస్తోన్న సుకుమార్ నిర్మాతగా కూడా బిజీగానే ఉన్నారు. తన స్వంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్‌తో పాటు ఇతర ప్రముఖ నిర్మాణ సంస్థలను కలుపుకుని తన డైరెరక్షన్ టీంలోని యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే దిశగా సుకుమార్ అడుగులు వేస్తున్నాడు. రీసెంట్‌గా కూడా నాగశౌర్యతో ఓ కొత్త దర్శకుడి సినిమాను అనౌన్స్ చేశాడు. దీనికి సుకుమార్ తోడుగా శరత్ మరార్ నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు. ఇదే భాగస్వామితో సుకుమార్ నితిన్‌తో ఓ సినిమా చేయబోతున్నాడని వినికిడి. వివరాల్లోకెళ్తే.. `కుమారి 21 ఎఫ్` డైరెక్టర్ సూర్య ప్రతాప్‌తో నితిన్ హీరోగా సుకుమార్ రైటింగ్స్, గీతాఆర్ట్స్ కలయికలో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం వెంకీ కుడుమల దర్శకత్వంలో నటిస్తోన్న నితిన్ ఆ సినిమా తర్వాత సుకుమార్ నిర్మాణంలో సినిమా ఉంటుంది. అయితే.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో గీతాఆర్ట్స్ భాగస్వామ్యం కావడం లేదట. దాంతో సుకుమార్ ప్లాన్ మార్చి.. శరత్ మరార్‌తోనే చర్చలు జరుపుతున్నాడట. ఇవి సఫలం అయితే మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారు త్వరలో.
Subscribe to YT|Tsnews.tv