Sukumar with Niharika
ఒక పక్క అగ్ర దర్శకుడిగా సినిమాలు చేస్తున్న సుకుమార్.. మరో పక్క నిర్మాతగా సుకుమార్ రైటింగ్స్ అనే సంస్థను స్థాపించి తన డైరెక్షన్ టీం తయారు చేసే మంచి కథలతో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఆ రకంగా వారికి దర్శకులుగా మారే అవకాశాన్ని కల్పిస్తున్నాడు సుకుమార్. రీసెంట్‌గా నిర్మాతగా రెండు సినిమాలను అనౌన్స్ చేశాడు సుకుమార్. తాజాగా మరో సినిమాకు రంగం సిద్ధమైంది. ఆ సినిమాలో నిహారిక కొణిదెల టైటిల్ పాత్రలో నటించబోతున్నారని సమాచారం. సుకుమార్ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించబోయే ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వ శాఖకు చెందిన వ్యక్తి డైరెక్ట్ చేయబోతున్నాడట. ప్రస్తుతం నిహారిక `సూర్యకాంతం`తో బిజీగా ఉంది. దాని తర్వాత సుకుమార్ బ్యానర్లో సినిమా చేస్తుందట.
For More Click Here
More Latest Interesting news