వైసీపీ టీడీపీలు బీజేపీకి శత్రువులే…

Sunil Deodhar Gives Clarity On YCP-BJP Alliance

ఏపీలో ఇప్పుడు వైసీపీ, బీజేపీల మధ్య పొత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. బీజేపీకి వైసీపీతో ఏ విధమైన పొత్తు ఉండదని సునీల్ దేవ్ ధర్ తేల్చి చెప్పారు. ఏపీలో జనసేనతో మాత్రమే పొత్తు ఉందని అన్నారు. జగన్ మాకు ప్రత్యర్థే అని స్పష్టం చేశారాయన. వైసీపీ, టీడీపీలు తమకు రాజకీయ ప్రత్యర్థులని.. జనసేనతో కలిసి వైసీపీ విధానాలపై పోరాటం చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామన్నారు. టీడీపీ, వైసీపీలను తాము సమానమైన రాజకీయ శత్రువులుగానే పరిగణిస్తామన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. రాజ్యసభలో బీజేపీకి బలం లేకున్నా వైసీపీ, టీడీపీ, బిజూ జనతాదళ్ మాకు మద్దతిచ్చాయని, అంతమాత్రాన పొత్తు పెట్టుకున్నట్లు కాదని సునీల్ వెల్లడించారు.

ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీని కలవడంతో వైసీపీ, బీజేపీ కలుస్తాయని.. పొత్తు పెట్టుకుంటాయని వార్తలు  వస్తున్న నేపధ్యంలో ఆయన ఈ విధంగా ప్సందించారు . బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో ఏకంగా జగన్ పార్టీ చేరుతుందని ప్రచారంపై  బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దేవ్ ధర్ కీలక వ్యాఖ్యలు చేశారు.స్థానిక ఎన్నికల్లో జనసేనతో కలిసి పని చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని సునీల్ దేవ్ ధర్ తెలిపారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని కలుస్తారని…అది కామన్ అన్నారు. దానికి వేరే అర్ధాలు తీసుకోవద్దని కోరారు. సీఎం జగన్ తప్పు నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఎన్ఆర్‌సి , సీఏఏ లకు పార్లమెంటులో మద్దతిచ్చి ఇప్పుడు బయట ఏ విధంగా వ్యతిరేకంగా ర్యాలీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై వైసీపీ నేతలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.వైసీపీ, టీడీపీ చాలా ప్రమాదకరమైన పార్టీలని సునీల్ అన్నారు.ఏపీ రాజధాని విషయంలో బీజేపీ అమరావతికే మద్దతిస్తుందని స్పష్టం చేశారు దేవ్ ధర్. రాజధాని విషయంలో అందరూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Sunil Deodhar Gives Clarity On YCP-BJP Alliance,ycp, bjp, sunil devdhar , janasena , local body elections , alliance , tdp , ememies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *