ఉనికి కోసమే ఆ తిప్పలు

112
sunkari Mahesh Goud comments on rajgopal reddy
sunkari Mahesh Goud comments on rajgopal reddy

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తపన మొత్తం మీడియాలో సెంట్రలైస్ కావలన్నదే అని సీనియర్ టి ఆర్ యస్ నేత సుంకరి మల్లేష్ గౌడ్ ఎద్దేవాచేశారు. ఆయనకు కావాల్సింది ప్రజలు,ప్రజా సమస్యలు కాదని అల్లరి సృష్టించి పేపర్లలో ఉండాలి అన్నదే అని ఆయన విమర్శించారు.అర్హులైన వారందరికీ ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస సృష్టించడం కూడా అందులో భాగమే నన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరుగుతుంటే చూస్తూ ఓర్వలేక ప్రభుత్వాన్ని బాధనాం చేసేందుకు వారు ఎంచుకున్న ఏకైక మార్గం అల్లరి సృష్టించడమే నన్నారు.ఉహకందనిది కలలో కూడా ఉహించనిది దామరచర్ల వద్ద మేఘా పవర్ ప్లాంట్ నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్ చలువ మాత్రమేనని అందుకు జిల్లా మొత్తం టి ఆర్ యస్ కు ఋణపడి ఉండాలని ఆయన ఉద్బోధించారు. సీమాంద్రల పాలనలో అక్కడి నాయకులకు బానిసగిరి చేసి కాంట్రాక్టూ ల పేరుతో దోచుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు టి ఆర్ యస్ ప్రభుత్వం లో పప్పులు ఉడకక పోవడంతో రాజకీయం చెయ్యాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ఆహార భద్రత కార్డులు పంపిణీ చేస్తుండగా అడ్డుకున్నది కాకుండా చేతుల నుండి మైక్ లాక్కోవడం కూడా మీడియా లో తాను ఉన్నా అని ఉనికిని చాటుకోవడానికే నని ఆయన దుయ్యబట్టారు.
ఎక్కడికి పోయినా కిరాయి మనుషులను వెంటేసక పోవడం జిందాబాద్ లు ముర్తాబాద్ లు కొట్టించడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు వెన్నెతో పెట్టిన విద్య అన్నది జిల్లా ప్రజలందరికీ తెలిసిందే నన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here