సన్నీలియోన్ ఇంటి ధరెంతో తెలుసా?

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ముంబైలోని అంధేరి సబర్బ్ లో కొన్న ఫ్లాటు కోసం ఎంత ఖర్చు చేసిందో తెలుసా? ఆమె ఎంత విస్తీర్ణంలో ఫ్లాట్ కొనుగోలు చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పైగా, మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి రాయితీ కూడా అందుకున్నారు. అదేంటో తెలుసా?

164
Sunny Leone bought flat for Rs. 16 Crore
Sunny Leone bought flat for Rs. 16 Crore

న్నీ లియోన్.. ఒకప్పుడు పోర్న్ స్టార్. బాలీవుడ్ లోకి అడుగుపెట్టి యువతను గిలిగింతలు పెడుతోంది. ఈ అమ్ముడు ఇటీవల ముంబైలోని అంధేరిలో సొంతిల్లు కొనుక్కుంది. ధర ఎంత తెలుసా? సుమారు రూ.16 కోట్లు. వామ్మో.. ఒక ఇల్లు కొనేందుకు పదహారు కోట్లు పెట్టిందా? అనేది మీ సందేహమా? అవును మరి. అంత సొమ్ము పెడితే ముంబైలో ఇల్లు కొనుక్కోవడం సాధ్యం కాదు. పైగా, తను కొనుక్కుంది బంగళా కూడా కాదు. అట్లాంటిస్ ప్రాజెక్టులోని పన్నెండో అంతస్తులో ఈ ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఆమెకు మూడు మెకనైజ్డ్ కారు పార్కింగులను క్రిస్టల్ ప్రైడ్ డెవలపర్స్ సంస్థ ఇచ్చిందట.

మార్చి 28న సన్నీ లియోన్ ఈ 4,365 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఇందుకు గాను సుమారు రూ.48 లక్షలు స్టాంప్ డ్యూటీ చెల్లించింది. రియల్ రంగాన్ని బలోపేతం చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని 2020 డిసెంబరులోపు ఐదు నుంచి రెండు శాతానికి తగ్గించింది. దీంతో, సన్నీ లియోన్ వంటి అనేకమంది సెలబ్రిటీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. జనవరి నుంచి మార్చి 31 మధ్యలో ఈ ఫ్లాటును కొనుగోలు చేయడంతో సన్నీ లియోన్ మూడు శాతం స్టాంప్ డ్యూటీని చెల్లించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here