సూపర్ బ్లడ్ మూన్ నేడే..

ఇవాళ ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. సూపర్ బ్లడ్ మూన్ దర్శనమివ్వనుంది. సంపూర్ణ చంద్రగ్రహణంగా పిలిచే ఈ సూపర్ బ్లడ్ మూన్ మధ్యాహ్నం 3.15 గంటల నుంచి సాయంత్రం 6.23 గంటల వరకు కనువిందు చేయనుంది. అయితే భారత్‌లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తిగా కనిపించదు. పాక్షికంగానే కనిపించనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే భారత్‌లోని అన్ని ప్రదేశాల్లో ఇది కనిపించదు.

ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశా తీరప్రాంతాలు, అండమాన్, నీకోబార్ దీవుల్లో కనిపించనుంది. ఇక దక్షిణ భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు. అటు అమెరికా, కెనడా, మెక్సికో, సెంట్రల్, ఈక్వెడార్, అర్జెంటీనా దేశాల్లో ఇది పూర్తిగా కనువిందు చేయనుంది. గ్రహణం సమయంలో చంద్రుడు ఎర్రగా రక్తపు ముద్దలా కనిపించనున్నాడు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article