నేడు టీడీపీలో చేరనున్న సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు

Super Star Krishna Brother Joined in TDP

ఏపీలో ఎన్నికలకు సమయందగ్గర పడుతుంటే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. నిన్నటికి నిన్న వంగవీటి రాధా కృష్ణ పార్టీకి రాజీనామా చేసి టిడిపి తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైపోయారు అన్న వార్తల నేపథ్యంలో విజయవాడలో వైసిపికి గట్టి దెబ్బ తగిలింది. ఇక తాజాగా మరో నేత జగన్ కు ఝలక్ ఇవ్వడానికి సిద్ధమైపోయారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆనేత టిడిపి తీర్ధం పుచ్చుకోబోతున్నారు. దీంతో ఎన్నికల సమయంలో జరుగుతున్న తాజా పరిణామాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
వైసీపీ అధినేత జగన్ కు సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు షాక్ ఇచ్చారు. టీడీపీలో చేరడానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. నేడు సీఎం సమక్షంలో టిడిపి తీర్ధం పుచ్చుకోబోతున్నారు. జగన్ దగ్గర సరైన గౌరవం దక్కటం లేదని బాధపడుతున్న ఆ నేత వైసీపీ ని వీడి టిడిపి లో చేరుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న టువంటి కీలక సమయంలో పార్టీకి ప్రముఖ నిర్మాత ఘట్టమనేని పార్టీ కి షాక్ ఇవ్వడం పార్టీ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది.ప్రముఖ నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు అయిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీకి ఇటీవల రాజీనామా చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావిస్తున్న ఆయన గుంటూరు ఎంపీ స్థానం నుండి ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నారు.కానీ జగన్ విజయవాడ ఎంపీగా అవకాశం ఇస్తాను అని చెప్పిన నేపథ్యంలో విజయవాడ నుండి బరిలోకి దిగడం ఇష్టంలేని ఘట్టమనేని వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఘట్టమనేని పార్టీ మారకుండా ఉంచడం కోసం వైసీపీ నేతలు తీవ్రంగానే ప్రయత్నించారు. తనకు కేటాయిస్తాం అంటున్న టికెట్ పై అసహనం వ్యక్తం చేసిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పార్టీలో ఉండేది లేదని తేల్చి చెప్పారు.జగన్ వైఖరి నచ్చక పార్టీ ని వీడుతున్నట్లు గా ఆయన ప్రకటించారు.ఒక పక్క సోదరుడు కృష్ణ అల్లుడు టీడీపీ నుండి ఎంపీ గా ఉన్నారు. వైసీపీలో ఉన్నంతకాలం పార్టీ కోసం, వైసీపీ గెలుపు కోసం ఎంతగానో కృషి చేశారు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు. అలాంటి నేత వైసీపీని వీడి టిడిపి బాట పట్టారు. ఏ పార్టీలో ఉన్న పార్టీ కోసం బాధ్యతాయుతంగా పనిచేసిన నేత కావడంతో చంద్రబాబు నాయుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తున్నారు. జగన్ ఒంటెద్దు పోకడలతో పార్టీలో ఇమడలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన ఆదిశేషగిరిరావు వైసిపి నుండి బయటకు వచ్చేశారు. నేడు సైకిల్ ఎక్కబోతున్నారు సినీ నటుడు, సోదరుడు కృష్ణ అభిమాన సంఘాలతో శేషగిరిరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్న ఆయన చేరికతో పార్టీకి లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. తన క్యాడర్ తోనూ , సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘాలతోనూ చర్చించిన తర్వాతనే ఆయన టీడీపీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వారి కుటుంబానికి చెందిన చాలామంది నేతలు టిడిపిలో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తోనూ సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో ఆదిశేషగిరిరావు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తోంది. అయితే ఆదిశేషగిరిరావు టికెట్ విషయంలో చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ ఆయనను ఒప్పించడంలో మాత్రం చంద్రబాబు సఫలం అయ్యారని ఆయన టిడిపిలో చేరాలని తీసుకున్న నిర్ణయం తోటి అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ద్వారా నేడు టీడీపీ లో చేరనున్న ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులు ఒకే పార్టీలో ఉండటంతో అటు కృష్ణ ఫ్యాన్స్, ఇటు మహేష్ ఫ్యాన్స్ సహకారం టిడిపికి ఉంటుందని భావిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article