వైసీపీ వీడి టీడీపీ లో చేరనున్న సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు

Superstar Krishna Brother Leaving YSR CP and Jumping to TDP

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో… వైసీపీ అధినేత జగన్ కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు పార్టీని వీడగా.. తాజాగా మరో సీనియర్ నేత పార్టీని వీడారు. సీనియర్ వైసీపీ నేత, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు వైసీపీని వీడారు. త్వరలో ఆయన టీడీపీలో చేరనున్నారు.
చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఆదిశేషగిరి రావు వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. అయితే.. వైసీపీ అధినేత జగన్ ఆయనను విజయవాడ ఎంపీగా పోటీచేయాలని ప్రతిపాదించారు.దీంతో మనస్థాపానికి గురై పార్టీ వీడారు. తన సోదరుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ అల్లుడు జయదేవ్‌ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయినా, బంధుత్వాన్ని పక్కనపెట్టి మరీ వైసీపీ విజయానికి 2014లో ఆయన కృషి చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article