కూల్చివేతకు సాక్ష్యాధారాలు లేవు

Babri masjid Demoition Final decesion

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు వెలువడింది. మసీదు కూల్చివేత కుట్రకాదని, అందుకు సాక్ష్యాధారాలు లేవని జడ్జి ఎస్‌కే యాదవ్ పేర్కొన్నారు. 2000 పేజీల తీర్పును న్యాయమూర్తి ఎస్కే యాదవ్ చదివి వినిపించారు. ఈ తీర్పుతో అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ సహా 32 మంది నిందితులు నిర్దోషులుగా తేలారు. 28 సంవత్సరాల అనంతరం తుది తీర్పు ఇవాళ వెలువడింది. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో 26 మంది కోర్టుకు హాజరు కాగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరుగురు నిందితులు హాజరయ్యారు.  తీర్పు వెలువడిన అనంతరం తాను జై శ్రీరాం అంటూ నినదించానని, ఇది తమందరికీ సంతోషకర క్షణమని అభివర్ణించారు. తీర్పును తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని అద్వానీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *