అగ్ర కోటాకు లోక్ సభ ఓకే

Supreme Court Agrees for Upper cast reservation

  • ఈబీసీ బిల్లుకు పార్టీలకు అతీతంగా మద్దతు
  • నేడు రాజ్యసభలో చర్చ

దేశంలో అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం కోటా కల్పిస్తూ కేంద్రం ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. ఇందుకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన 124వ రాజ్యాంగ సవరణకు సభ పార్టీలకు అతీతంగా ఆమోదం తెలిపింది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ పార్లమెంటు సమావేశాలకు మంగళవారమే చివరి రోజు కావడంతో ఇందుకు సంబంధించిన ఈబీసీ బిల్లును కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టింది. దీనిపై దాదాపు ఐదు గంటలపాటు చర్చ జరిగింది. విపక్ష పార్టీలన్ని దీన్ని ఎన్నికల గిమ్మిక్కుగా అభివర్ణించినప్పటికీ, బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఇండియన్ ముస్లిం లీగ్, ఎంఐఎం మినహా మిగిలిన పార్టీలన్నీ అనుకూలంగా వ్యవహరించాయి. ఓటింగ్ సమయంలో అన్నాడీఎంకే వాకౌట్ చేసింది. చర్చ సందర్భంగా ఈబీసీ బిల్లుకు పలు పార్టీలు సవరణలు సూచించినా.. బీజేపీ వాటిని పట్టించుకోలేదు. బిల్లుపై చర్చ ముగింపు సందర్భంగా.. కేంద్ర మంత్రి థావర్‌ చంద్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 15కి క్లాజ్‌(6), 16కి క్లాజ్‌(6) చేరుస్తున్నామని ప్రకటించారు. రెండేళ్ల క్రితం తమ ప్రభుత్వమే క్రీమీలేయర్ పరిమితిని రూ.6 లక్షల నుంచి 8 లక్షలకు వరకు పెంచిందని తెలిపారు. రాజ్యాంగ సవరణ బిల్లు కావడం వల్ల డివిజన్‌ ఓటింగ్‌ తప్పనిసరి అని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ పేర్కొన్నారు. దీంతో సభ్యులు ప్రతిపాదించిన సవరణలపై డివిజన్‌ పద్దతిలో స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించారు. రిజర్వేషన్‌ బిల్లుకు అనుకూలంగా323 మంది సభ్యులు, వ్యతిరేకంగా ముగ్గురు సభ్యులు ఓటు వేశారు. మూడింట రెండొంతులకు పైగా మెజార్టీతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ప్రకటించారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత లోక్‌సభ నిరవధిక వాయిదాపడింది. లోక్‌సభ ఆమోదంతో ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. ఇందుకోసమే రాజ్యసభ సమావేశాలను మరో 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article