సర్జికల్ స్ట్రైక్ ఎఫెక్ట్

37
NO JAWAN WAS KIDNAPPED
NO JAWAN WAS KIDNAPPED

Surgical Strike effect .. బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో పాజిటివ్ వేవ్ అన్న యడ్యూరప్ప

పాకిస్థాన్లో ఉగ్రవాదులు శిబిరాలపై భారతదేశం వేసిన ముందడుగు కారణంగా భారత ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని కర్ణాటక బిజెపి చీఫ్ బి ఎస్ యడ్యూరప్ప తెలిపారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో లోక్సభ ఎన్నికలకు పాకిస్తాన్ ఉగ్రవాదులు శిబిరాలపై దాడులు చేసి ప్రధాని నరేంద్ర మోడీ ఒక పాజిటివ్ వేవ్ సృష్టించారని ఆయన పేర్కొన్నారు.కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం 28 లోకసభ స్థానాలలో ఇరవై రెండు స్థానాలలో బిజెపి విజయకేతనం ఎగరవేయడానికి ఈ ముందడుగు ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ సహాయం చేశారని ఆయన పేర్కొన్నారు.
చిత్రదుర్గ లో విలేకరులతో మాట్లాడిన ఆయన పాకిస్తాన్ భూభాగం లోకి ప్రవేశించి భారత ప్రభుత్వం మూడు తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందని, దేశవ్యాప్తంగా మోడీ అనుకూల పవనాలను ఇది తెచ్చిపెట్టిందని, దీని ప్రభావం రానున్న ఎన్నికల్లో తప్పక ఉంటుందని యడ్యూరప్ప పేర్కొన్నారు. తాజాగా యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. పుల్వామా ఉగ్రదాడుల లో 40 మంది భారత సైన్యాన్ని కోల్పోయిన భారతదేశం ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ చేస్తే దానిని రాజకీయాలతో లింకు పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు యడ్యూరప్ప .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here