Surgical Strike once again.. ? భారత్ ఏం చెయ్యబోతుంది
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి గుణపాఠం చెబుతామన్న భారత్ ముందున్న ఆయుధం అదేనా..? దెబ్బకు దెబ్బ తీస్తామన్న మన ఆర్మీ నెక్ట్స్ ఆప్షన్.. మెరుపు దాడులేనా..? పీవోకేలో మరోసారి సర్జికల్ స్ట్రైక్ తప్పదా..? ఉగ్రవాదులను విడిచిపెట్టొద్దు పుల్వామా ఘటనకు సమాధానం చెప్పాల్సిందే అంటున్నాడు ప్రతీ భారతీయుడు. ఇప్పుడు దేశం యావత్ ఇదే మాటపై నిలబడింది.సర్జికల్ స్ట్రైక్.. పుల్వామా ఉగ్రదాడి తర్వాత మరోసారి దేశవ్యాప్తంగా వినిపిస్తున్న మాట.
దేశం కోసం మరోసారి సర్జికల్ స్ట్రైక్ తప్పదా అనే వాదన వినిపిస్తుంది. ఇప్పటికే ప్రపంచంలో పాక్‌ను ఒంటరి చేసే యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్న కేంద్రం రెండో వైపు పాక్‌కు ప్రత్యక్షంగా తగిన బుద్ది చెప్పేందుకు రెడీ అవుతోంది. 2016 లో ఉరి సైనిక స్థావరంపై.. ఉగ్రవాదులు దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపి 18 మంది జవాన్ల ప్రాణాలను బలితీసుకున్నారు. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై అప్పట్లో మెరుపుదాడులు చేసింది. దీంతో పుల్వామా ఘటన నేపథ్యంలో పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంటున్న మనదేశం మరోసారి సర్జికల్ స్ట్రైక్‌కు దిగుతుందని చెబుతున్నారు. అమరవీరుల త్యాగం వృథాగా పోదని 130 కోట్ల మంది భారతీయులు పాక్‌కు దీటైన జవాబిస్తారని ప్రధాని మోడీ హెచ్చరించారు. పుల్వామా ఘటన విషయంలో పాక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉరీ ఘటన తర్వాత ఉగ్రవాదులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన కేంద్రం తాజాగా కూడా అదే లెవెల్లో పాక్‌కు గుణపాఠం చెబుతామంటూ వార్నింగ్ ఇచ్చింది. అందులో భాగంగానే పాక్‌పై ఎప్పుడు, ఎలా, ఏ సమయంలో ప్రతీకారం తీర్చుకోవాలనేది సైన్యానికి వదిలిపెడుతున్నామని, అందుకు అన్ని అనుమతులు ఇస్తున్నట్లు మోడీ తెలిపారు. వాళ్లకు ఎలా బుద్ధి చెబుతారో మీ ఇష్టం అంటూ భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో ఈ సారి భారీ లెవెల్లో మెరుపు దాడులుంటాయనే వాదన వినిపిస్తుంది.
For More Click Here