హ్యాట్సాఫ్ సూర్య

214
shock to surya
shock to surya

surya commitment

డెడికేషన్ అంటే అదీ.. సినిమాపై వ్యామోహం అలా ఉంటుంది. ఒక సినిమా కోసం ఇంత కష్టపడతారా.. అని కొందరిని చూస్తేనే అనిపిస్తుంది. అలాంటి వారే సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా స్టార్డమ్ తో పాటు క్రేజ్ ను కలిగి ఉంటారు. అలాంటి వారిలో సౌత్ లో ద బెస్ట్ అనిపించుకున్న స్టార్ సూర్య. అతనెందుకు ఇంత బెస్ట్ అనేది ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రూవ్ చేసినా.. మరోసారి మెస్మరైజ్ చేస్తున్నాడీ స్టార్. సూర్య.. సౌత్ లోని మోస్ట్ టాలెంటెడ్ స్టార్ హీరోస్ లో ఒకడు. పాత్ర కోసం ఏమైనా చేయడంలో సూర్య ఎప్పుడూ ముందే ఉంటాడు. తను నటుడుగా కెరీర్ మొదలుపెట్టిన నాటి నుంచే ఎన్నో ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా కోసం ఏకంగా టీనేజ్ కుర్రాడి నుంచి 70యేళ్ల వయసువాడి వరకూ భిన్నమైన ఏజ్ గ్రూప్స్ లో కనిపించి తన డెడికేషన్ ప్రూవ్ చేసుకున్నాడు. సూర్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

అందులో ముందుగా రాబోతోన్న చిత్రం ఆకాశం నీ హద్దురా. గురు ఫేమ్ సుధా కొంగర డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో కూడా అతను డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో కనిపించాల్సి ఉంటుంది. అందుకోసం ఎంతో కష్టపడుతున్నాడు. హీరోలంటే ఫిట్ గా ఉండటం కోసం కసరత్తులు చేస్తారు. కానీ పాత్రల కోసం చేసే కసరత్తులు హార్డ్ గా ఉంటాయి. ఆ కష్టాన్ని అలవోకగా అనుభవిస్తూ.. దర్శకురాలికి ఏం కావాలో అలా తయారయ్యాడు సూర్య. ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ప్రస్తుతం సూర్య వయసు 44యేళ్లు.  ఆకాశమే నీ హద్దురా సినిమాలో 18యేళ్ల కుర్రాడిగా కనిపించే ఓ పాత్ర ఉందట. ఆ పాత్రలో తనే కనిపించేందుకు తన వయసును సగానికి పైగా తగ్గించుకున్నాడు. ఇప్పుడున్న వయసు నుంచి టీనేజ్ లుక్ తేవడం అంత సులభం కాదు. కానీ అతని డెడికేషన్ గురించి ఆల్రెడీ తెలుసు కదా.. అందుకే ఆశ్చర్యం లేదు. కానీ మెచ్చుకోకుండా ఉండలేం. ఇక ఈ విషయాన్ని డైరెక్టర్ సుధా కొంగర కూడా చాలా ఆశ్చర్యంగా చెబుతుండటం విశేషం. ఏదేమైనా ఇలాంటి హీరోలు ఇంకా తెలుగులో లేరనే చెప్పాలేమో..

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here