బంగారం పంచి పెట్టిన హీరో సూర్య‌

GOLD Distributed BY Tamil Hero SURYA
హీరో సూర్య మ‌నసు బంగారం అని ఆయ‌న సినిమా `ఎన్‌.జి.కె`కు పనిచేసిన యూనిట్ స‌భ్యులు అంటున్నారు. సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం రీసెంట్‌గా చివ‌రి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగ‌మైన 120 మంది యూనిట్ స‌భ్యుల‌కు ఒక్కొక్క‌రికీ 1 గ్రాము బంగారు కాయిన్‌ను సూర్య బ‌హుమ‌తిగా అందించాడ‌ట‌. సూర్య ఇచ్చిన బ‌హుమ‌తికి యూనిట్ స‌భ్యులు హ్యాపీగా ఫీల‌వుతున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ర‌కుల్  ప్రీత్ సింగ్‌, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టించారు. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. 
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article