సూర్యది సాహసమా.. ముందు చూపా?

41
shock to surya
shock to surya

Surya in web series

వైవిధ్యమైన సినిమాలు అంటూ ఇప్పటికే చాలా మార్కెట్ లాస్ అయ్యాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. ఒకప్పుడు విజయ్, అజిత్ కు పోటీ ఇస్తాడు లేదంటే వారి తర్వాతి ప్లేస్ ను ఆక్రమిస్తాడు అనుకున్నారు. కానీ కేవలం డిఫరెంట్ స్టోరీస్, గెటప్స్ అంటూ ఉన్న మార్కెట్ ను పోగొట్టుకున్నాడు. తెలుగులోనూ ఓ దశలో సూర్య కు 25కోట్లకు పైగా మార్కెట్ ఉండేది. కానీ ఇప్పుడు అందులో మూడో వంతు కూడా డౌట్ గానే కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో మరో సాహసం చేస్తున్నాడు సూర్య. ప్రస్తుతం ఆకాశమే నీ హద్దురా అనే సినిమాతో రాబోతోన్న సూర్య.. అటుపై హరి, గౌతమ్ మీనన్, వెట్రిమారన్ వంటి దర్శకులతో సినిమాలు లైన్ లో పెట్టుకుని ఉన్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఆకాశమే విడుదల కూడా ఆగిపోయింది కదా. అందుకే ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపూ చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ కారణంగానే సూర్య త్వరలో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. తమిళ్ సినిమా వాళ్లు ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. ఇది మరీ కొత్తది అని చెప్పలేం కానీ.. అక్కడ తాజాగా ఓ వెబ్ సిరీస్ మొదలవుతోంది.

ఈ సిరీస్ లో తొమ్మిది భాగాలుంటాయి. ఆ తొమ్మిది భాగాలను తొమ్మిది మంది పేరున్న దర్శకులు డైరెక్ట్ చేస్తారు. ఈ లిస్ట్ లో ఇండియన్ టాప్(ఒకప్పుడు) డైరెక్టర్ మణిరత్నం కూడా ఉండటం విశేషం. అలాగే గౌతమ్ మీనన్, సెల్వ రాఘవన్ పేర్లూ వినిపిస్తున్నాయి. ఇందులో ఓ సిరీస్ లో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. అలాగే సూర్యతో పాటు మరికొన్ని పార్ట్స్ లో ముఖ్యంగా మణిరత్నం డైరెక్ట్ చేసే భాగంలో సిద్ధార్థ్, అరవింద్ స్వామిలు నటిస్తున్నారు. మొత్తంగా రాబోయే రోజుల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ దే హవా అవుతుందని ఇప్పటికే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందువల్ల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సూర్య ఇలా చేస్తున్నాడా లేక జస్ట్ ఛేంజ్ ఓవర్ కోసం చేస్తున్నాడా అనేది చెప్పలేం కానీ.. ఓ స్టార్ హీరోల ఇలా క్రేజ్ ఉండగానే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంటర్ కావడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఇది సాహసమా లేక ముందు చూపా అనేది అతనికే తెలియాలి.

cinema news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here