సూర్య నెక్ట్స్ మూవీ ఎవ‌రితో తెలుసా!

surya next movie with ?
 తెలుగు, త‌మిళంలో త‌న‌కంటూ మార్కెట్ క్రియేట్ చేస్తున్న హీరోల్లో సూర్య ఒక‌రు. ఈ హీరో ఇప్పుడు కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య చేస్తోన్న సినిమా `కాప్పాన్‌` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. కాగా సూర్య త‌న త‌దుప‌రి చిత్రానికి రెడీ అవుతున్నాడు. సూర్య ఎవ‌రితో చేస్తాడ‌నే దానిపై క్లారిటీ వ‌చ్చేసింది. మాధ‌వ‌న్‌, రితికా సింగ్‌ల‌తో `ఇరుదుసుట్రు` సినిమా చేసిన లేడీ డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర‌.. దాన్నే తెలుగులో వెంక‌టేష్‌, రితికా సింగ్‌ల‌తో `గురు`పేరుతో రీమేక్ చేసి స‌క్సెస్‌ను అందుకుంది. ఇప్పుడు సుధాకొంగ‌ర త‌దుప‌రి చిత్రాన్ని సూర్య‌తో చేయ‌నుంది. ఈ విష‌యాన్ని ఆమె త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేసింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. జి.వి.ప్ర‌కాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియజేస్తామ‌ని సుధాకొంగ‌ర తెలిపారు
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article