Surya was postponing
సూర్య, సెల్వరాఘవన్ కాంబినేషన్‌లో `ఎన్.జి.కె` ఏ ముహూర్తాన మొదలైందో కానీ.. సినిమాను గత ఏడాది దీపావళి రోజునే విడుదల చేయాలనుకున్నారు. అయితే మధ్యలో సెల్వరాఘవన్‌కు కాస్త ఆరోగ్యం బాగా లేకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడింది. సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయాలని డ్రీమ్ వారియర్స్ సంస్థ అనుకుంది. అయితే ఏప్రిల్‌లో ఎన్నికలు .. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవడం వంటి కారణాలతో సినిమాను మే నెలలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు, అటు తమిళనాడులో ఎన్నికల వల్ల ఎన్‌జికెను వాయిదా వేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్స్‌గా నటించారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ 5 మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుంది.
For More Click Here