సూర్యాపేటలో నకిలీ టీ పొడి తయారీ గుట్టు రట్టు

Suryapeta police Caught Fake tea powder makers

నిజజీవితంలో మనం ఉపయోగించే వస్తువులను ఏది అసలైనది ఏది నకిలీ అని తేల్చుకోవడం కష్టం గా మారిపోయింది. కాదేదీ నకిలీ కనర్హం అన్నట్టుగా వ్యవస్థ తయారైపోయింది. అప్పులు పప్పులు దగ్గరనుండి టీ పొడి చక్కెర వరకు కూడా నకిలీ తయారవుతున్నాయి అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. డబ్బు సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతున్న కొందరు ఈ నకిలీ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా సూర్యాపేటలో నకిలీ ఈ పొడిని తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది.
నకిలీ టీ పొడిని తయారు చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్న వారిని సూర్యాపేట టాస్క్‌పోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 200 క్కింటాళ్ల నకిలీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసి న సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన పి.నర్సింహారావు కొద్ది రోజులుగా సూర్యాపేటలోని ఎన్టీఆర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆర్‌ఎంపీగా పని చేసి సూర్యాపేటలో ప్రైవేట్‌ ఆసుపత్రులను లీజుకు తీసుకొని నిర్వహించాడు. ఆ విషయంలో ఆర్థికంగా నష్టాలు వచ్చాయి. తేలికగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో అక్రమ వ్యాపారాలు చేయాలని భావించాడు.
అంతకుముందే సూర్యాపేటలోని నెహ్రునగర్‌కు చెందిన మునగ వెంకటేశ్వర్‌రావు నకిలీ టీ పొడిని తయారు చేసి విక్రయించేవాడు. కొన్నాళ్లుగా టీ పొడి తయారీని నిలిపివేశాడు. అయితే అతనితో నర్సింహరావుకు పరిచయం ఏర్పడింది. దీంతో నర్సింహరావు వెంకటేశ్వర్‌రావుతో కలిసి ఆయన నివాసంలోనే నకిలీ టీ పొడిని తయారు చేస్తూ హోల్‌సేల్‌గా విక్రయాలు చేస్తున్నారు. లూజ్‌గా టీ పొడిని తక్కువ కొనుగోలు చేసి అందులో రంపం పౌడర్‌, రోజ్‌కలర్‌, బెల్లం, ఇతర రసాయనాలను కలిపి టీ పొడి తయారు చేస్తున్నారు. మార్కెట్‌లో కిలోకు రూ.600 చొప్పున విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యానికి హానీ తలపెడుతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సూర్యాపేట టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది నెహ్రునగర్‌లోని వెంకటేశ్వర్‌రావు ఇంట్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.లక్ష 20వేల విలువ చేసే 200కేజీల టీ పొడితో పాటు తయారీకి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇక ఈ ముఠా గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది ని ఉన్నతాధికారులు అభినందించారు. ఇంతకాలం వారు తయారుచేసిన టీ పొడిని వినియోగించిన వారంతా నకిలీ టీ పొడి అని తెలుసుకొని అవాక్కయ్యారు. ఇలాంటి నకిలీ వ్యాపారాలను అరికట్టి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article