SVBC CHAIRMAN PRITHVIRAJ RESIGNED
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్విరాజ్ ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడినట్టు కొన్ని ప్రసార మాధ్యమాల్లో ఆడియో ప్రసారాలు చేశారు. దీనిపై ఎస్వీబీసీ చైర్మన్ స్పందిస్తూ తనపై బురద చల్లేందుకు ఎవరో పనిగట్టుకొని తన స్వరాన్ని అనుకరించి ఆడియో రూపొందించారని టిటిడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి నివేదించారు. ఈ విషయమై టిటిడి చైర్మన్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆడియోలోని వాయిస్ శాంపిల్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పూర్తిస్థాయిలో విచారణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పై విషయాన్ని టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ముఖ్యమంత్రికి తెలియజేయగా వారు స్పందిస్తూ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని పృథ్వీరాజ్ ను టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఆదేశించారు. దీంతో, ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పుని నిరూపించాకే మళ్లీ ఎస్వీబీసీలోకి అడుగుపెడతానని పృథ్వీరాజ్ అన్నట్లు సమాచారం.