స్వామీ చిన్మయానంద్ కు బెయిల్‌ మంజూరు…

158
Swami Chinmayanand gets bail
Swami Chinmayanand gets bail
Swami Chinmayanand gets bail
లైంగిక దాడిఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి  స్వామీ చిన్మయానంద్ కు బెయిల్‌ లభించింది. తన ఆశ్రమంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారని గత ఏడాది సెప్టెంబర్‌లో లైంగిక దాడి కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. షహజన్‌పూర్‌లో లా కాలేజీలోఅడ్మిషన్‌ విషయమై తనకు సహాయపడిన చిన్మయానంద్‌ తనను ఏడాది పాటు లైంగికంగా వేధించాడని బాధిత విద్యార్థిని ఆరోపించిన  వ్యవహారంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు . కాలేజ్‌లోని హాస్టల్‌లో తాను స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసిన చిన్మయానంద్‌ వాటిని వైరల్‌ చేస్తానని బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నవ్ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర మాజీమంత్రి స్వామి చిన్మయానంద్  న్యాయ విద్యార్థినిని నిర్బంధించి ఏడాది కాలం పాటు అత్యాచారం చేసిన కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఇక తాజాగా  ఆయనకు బెయిల్‌ మంజూరైంది. ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు ఆయనకు బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలను జారీ చేసింది.ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నవ్‌కు చెందిన స్వామి చిన్మయానంద్‌..న్యాయ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రస్తుతం ఆయన కారాగార శిక్షను అనుభవిస్తున్నారు. ఈ కేసులో ఆయనపై నమోదైన ఆరోపణలన్నీ సాక్ష్యాధారాలతో సహా నిరూపితమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here