సాగర జలాలలో వెంకన్న విహార యాత్ర

విశాఖఫట్నం:స్వామి వారి విహార యాత్ర కన్నుల పండుగగా సాగింది.సాగర జలాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షించి తన్మయపరిచారు.విశాఖ పోర్టు ఏరియాలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.శ్రీ వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారి తెప్పోత్సవాన్ని పోర్టు ట్రస్ట్ సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామివారిని మేళతాళాలతో కొండపై నుండి కిందకు వేంచేయించారు. ఆ తరువాత స్వామి వారిని రథంపై కొలువుదీరి ఊరేగింపుగా సాగర తీరానికి తీసుకువెళ్లారు.అనంతరం సాగరజలాలపై సుందరంగా అలంకరించిన నౌక వాహనంపై స్వామి వారిని వేంచేయించి సముద్ర అలలపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు మధ్య స్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.స్వామివారి తెప్పోత్సవంలో పాల్గొన్న భక్తులు గోవింద గోవింద అంటూ హరి నామ స్మరణ చేశారు సముద్రమంతా గోవింద నామాలతో మారు మ్రోగి పోయింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article