ఎఫ‌ర్డ్ ప్లాన్‌తో “స్వ‌స్థ్ లాయ‌ల్టీ ప్రోగ్రాం”

95

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆసుప‌త్రుల్లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రి… కుటుంబాల‌కు వైద్య‌చికిత్స‌ల కోసం ఆర్థిక ప్ర‌ణాళిక‌ల‌ను తీసుకొచ్చే ఎఫ‌ర్డ్ ప్లాన్‌తో క‌లిసి “స్వ‌స్థ్ లాయ‌ల్టీ ప్రోగ్రాం” ప్రారంభిస్తోంది. ల‌బ్ధిదారుల‌కు ఎప్పుడు వైద్య‌సేవ‌లు అవ‌స‌ర‌మైనా, మందులు కొనాల‌న్నా వారికి దీనివ‌ల్ల ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఎఫ‌ర్డ్ ప్లాన్ స్వ‌స్థ్ మ‌రియు ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రి క‌లిసి హైద‌రాబాద్ వాసుల కోసం ఒక హెల్త్‌కేర్ సేవింగ్స్ కార్డును ప్రారంభిస్తున్నాయి. ఇది వారికి మంచి వైద్య‌సేవ‌ల‌ను అందిస్తుంది.

ఇందులో చేరేవారికి ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రిలో ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌తో మొత్తం కుటుంబానికి వైద్య‌చికిత్స‌ల‌కు ఫైనాన్సింగ్ కూడా దొరుకుతుంది. ఎఫ‌ర్డ్ ప్లాన్ స్వ‌స్థ్‌తో యెస్ బ్యాంక్ వారి ప్రీపెయిడ్ కార్డు, డిజిట‌ల్ వ్యాలెట్ వ‌స్తాయి. వాటితో ఓపీడీ (ఔట్‌పేషెంట్ డిపార్టుమెంట్) సేవ‌లు, ల్యాబ్ ప‌రీక్ష‌లు, మందుల కొనుగోలు, ఆసుప‌త్రిలో చేరితే ఈఎంఐల‌తో చెల్లించే అవ‌కాశం ల‌భిస్తాయి.

ఈ సంద‌ర్భంగా ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రుల ఛైర్మ‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ దండు శివ‌రామ‌రాజు మాట్లాడుతూ, “ఆసుప‌త్రిలో చేర‌డం కొన్నిసార్లు చాలా బాధాక‌రం. వైద్య అత్య‌వ‌స‌రాల‌కు ముందుగా సిద్ధం కాక‌పోవ‌డం వ‌ల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయి. ఇలాంటి సంద‌ర్భాల్లో సాయం అందితే ఎంతో బాగుంటుంది. మ‌ధ్య‌త‌ర‌గతి కుటుంబాల‌కు భ‌విష్య‌త్తులో వ‌చ్చే క‌ష్టాల్లో ఎఫ‌ర్డ్ ప్లాన్ స్వ‌స్థ్ కార్డు ఆదుకుంటుంది. వైద్య‌బీమా చేయించుకోవాల‌ని నేను స్వ‌యంగా చాలామందికి చెబుతాను. అత్య‌వ‌స‌రాల‌కు ముందే సిద్ధం కావాలంటాను. ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రుల ప్ర‌మోట‌ర్‌గా, ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామి కావ‌డం చాలా సంతోషంగా, గ‌ర్వంగా ఉంది” అన్నారు.

“ఎఫ‌ర్డ్ ప్లాన్ స్వ‌స్థ్ కార్డు కొన్నిర‌కాల చికిత్స‌ల‌కు 0% వ‌డ్డీతో వైద్య రుణాలు ఇవ్వ‌డ‌డంతో పాటు ప్ర‌మాదాల్లో అత్య‌వ‌స‌ర చికిత్స‌ల‌కు బీమా కూడా ఉచితంగా అందిస్తుంది. చిప్ ఉన్న కార్డు వ‌ల్ల క‌స్ట‌మ‌ర్లు అప్ప‌టిక‌ప్పుడే క్యాష్‌బ్యాక్, ఆసుప‌త్రుల్లో ఆఫ‌ర్లు, కొన్ని బ్రాండ్ల‌పై రాయితీలు ల‌భిస్తాయి. ఎఫ‌ర్డ్ ప్లాన్ స్వ‌స్థ్ భాగ‌స్వాముల‌తో ఇవి అందుతాయి” అని ఎఫ‌ర్డ్ ప్లాన్ సీఈవో, బోర్డు స‌భ్యుడు ఆదిత్య శ‌ర్మ చెప్పారు.

ఎఫ‌ర్డ్ ప్లాన్ స్వ‌స్థ్ కార్డు కార్య‌క్ర‌మంలోనే రివార్డుల ప్లాట్‌ఫాం ఉంది. ఇందులో క‌స్ట‌మ‌ర్ల‌కు చికిత్స‌ల‌కు సంబంధించిన ఉత్ప‌త్తులు, సేవ‌లు… రివార్డులు, ప్రోత్సాహ‌కాల రూపంలో అందుతాయి. దీని వ‌ల్ల ఆసుప‌త్రులు, ఫార్మ‌సీల‌లో క‌స్ట‌మ‌ర్లు న‌గ‌దు లావాదేవీలు చేయ‌క్క‌ర్లేకుండా సుర‌క్షితంగా ఉంటారు. క‌స్ట‌మ‌ర్ల‌కు అత్యున్న‌త భ‌ద్ర‌త ల‌భిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here