విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ

147
SWINE FLU INCREASING
SWINE FLU INCREASING

SWINE FLU INCREASING

  • తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు
  • జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన

తెలుగు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ స్వైరవిహారం సాగిస్తోంది. చలి తీవ్రత పెరగడం, అకాల వర్షాలు పడుతుండటంతో ఈ వైరస్ పెరుగుతోంది. గత రెండు రోజుల్లో స్వైన్ ఫ్లూ బారిన పడిన వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ రెండు రోజుల్లో దాదాపు 200 మంది స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. ఓ వైపు స్వైన్ ఫ్లూ పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ప్రజల్లో సరైన అవగాహన కల్పించడంలేదు. మూడేళ్ల క్రితం ఇదే తరహాలో స్వైన్‌ఫ్లూ విజృంభించినపుడు.. వైద్య ఆరోగ్యశాఖ కరపత్రాలు, స్లైడ్లు, ఫ్లెక్సీలు, మీడియా ప్రకటనలు తదితర పద్దతుల్లో విస్త్రృత ప్రచారం నిర్వహించింది. దీంతో పిల్లలు, పెద్దలు మాస్క్‌లు ధరించి బయటకు వచ్చేవారు. తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈసారి మాత్రం కనీస ప్రచారం, అప్రమత్తత లేకపోవడంతో.. స్వైన్‌ఫ్లూ వచ్చే వరకు కూడా ప్రజలు గుర్తించలేకపోతున్నారు.  వాస్తవానికి శీతాకాలంలోనే స్వైన్‌ఫ్లూ విజృంభిస్తుంది. ప్రస్తుతం రాత్రితోపాటు పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఫ్లూ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీల నమోదు కావడం, కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల వరకు పడిపోవడం స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవీ స్వైన్ ఫ్లూ లక్షణాలు…

  • తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన తలనొప్పి
  • పిల్లలకు కొన్ని సందర్భాల్లో తీవ్రమైన శ్వాస సమస్య ఎదురువుతుంది. ఒక్కోసారి చర్మం బ్లూ లేదా గ్రే కలర్‌లోకి మారుతుంది. దద్దుర్లు వస్తాయి. వాంతులు అవుతాయి. ఒక్కోసారి నడవడమే కష్టమవుతుంది.
  • పెద్దలకు కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీ నొప్పి, కడుపునొప్పితోపాటు వాంతులు అవుతాయి.

ఇవీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

  •  జనం ఎక్కువగా ఉన్న చోట తిరగకూడదు.
  • చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసకోవాలి. అవకాశముంటే గ్లౌవ్స్‌ తొడుక్కోవాలి.
  • దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, అధిక జ్వరం ఉండి, స్వైన్‌ఫ్లూ అనుమానం వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
  • రక్తపోటు, స్థూలకాయం, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి స్వైన్‌ఫ్లూ త్వరగా సోకడానికి అవకాశముంది. కాబట్టి అలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

HEALTH NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here