గాంధీ ఆస్పత్రిలో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు..

Swine Flue Cases increasing in Gandhi Hospital

రాష్ట్రంలో వాతావరణ మార్పులతో వీస్తున్న చలిగాలులకు పలు వైరస్ లు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో స్వైన్ ఫ్లూ పంజా విసురుతోంది. దీంతో నగరవాసులు వణికిపోతున్నారు. స్వైన్ ఫ్లూ వైరస్ మళ్లీ విజృంభిస్తున్న ఈ క్రమంలో స్వైన్‌ ఫ్లూ లక్షణాలతో శామీర్‌పేటలోని నల్సార్ యూనివర్సిటీకి చెందిన నలుగురు స్టూడెంట్ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. వీరితో కలిపి స్వైన్‌ ఫ్లూతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు తొమ్మిది మందికి చేరారు.
రోజుకో తీరుగా మారిపోతున్న వాతావరణంలో అనూహ్యంగా మార్పులు చోటుచేసుకోవటంతో స్వైన్ ఫ్లూ వ్యాధి వేగంగా విస్తరిస్తోందని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో చిన్నారులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు అత్యవసరంగా తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫ్లూ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ఆసుపత్రికి వెళ్లి డాక్టర్స్ సలహాలు, సూచనలకు పాటించాలని లేదంటే అది మరింతగా వ్యాపించి ప్రాణాపాయానికి కూడా దారి తీసే అవకాశం ఉంటుందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.
స్వైన్ ఫ్లూ కారక హెచ్1 ఎన్1 వైరస్ కారణంగా తెలంగాణలో ఇప్పటికే 75 మందికి పైగా మరణించారు. చల్లదనం పెరిగే కొద్దీ మరింతగా వ్యాపించే ఈ వ్యాధికి గురయ్యే అవకాశముంటుదంటున్నారు. పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న శీత గాలులు హైదరాబాద్ నగరవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సాధారణ జలుబులో ఉండే లక్షణాలే స్వైన్ ఫ్లూకు ఉండటం గమనార్హం. అందుకే ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇక రాష్ట్రంలో మరో 48 గంటల పాటు శీతల గాలుల ప్రభావం మరింత అధికంగా ఉంటుందని..హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదు కాగా, గరిష్టంగా 21 డిగ్రీలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. మహారాష్ట్రలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై కొనసాగుతోందని చెప్పిన అధికారులు ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Check Out Latest Offers in Amazon

For more Filmy News

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article