వణికిస్తున్న స్వైన్ ఫ్లూ

Swine flue Effected once again… జర

భద్రంఒకేసారి ఐదు స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో కలకలం రేగింది. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. చలి అధికంగా ఉండడంతో స్వైన్ ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోనే ఐదు స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో స్వైన్‌ఫ్లూతో ఇద్దరు మరణించారు. గతవారం గాంధీ ఆస్పత్రిలో చేరిన పది మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. అందరికీ పాజిటివ్‌ రిపోర్ట్ వచ్చింది. ఇందులో నలుగురు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా.. ఒకరు ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తిగా వైద్యులు తెలిపారు. ఐదుగురిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఓ మహిళ స్వైన్‌ ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. తెలంగాణలో స్వైన్‌ ఫ్లూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నట్టు IPM డైరెక్టర్‌ శంకర్‌ వెల్లడించారు. జనవరిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల నుంచి దాదాపు 800 శాంపిల్స్‌ తీసుకుంటే.. అందులో 90 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కాగా చలికాలం కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో స్వైన్ ఫ్లూ వైరస్ పంజా విసురుతోంది. గాలిలో కలిసి ఉన్న ఎన్‌1హెచ్‌1 వైరస్‌ చలి పెరిగిన సమయంలో విస్తరిస్తుంటుంది. అయితే ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే మాస్కులు ధరించాలని.. కాచి వడపోసిన నీటిని తీసుకోవాలని.. అలాగే చలి సమయంలో ఎక్కువగా బయట తిరగడం మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article