సయ్యద్ షుజా వ్యాఖ్యల కలకలం

Syed Shuja comments caused outrage

.. ఇరకాటంలో బీజేపీ నేత కిషన్ రెడ్డి

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ ఉదంతం రాజకీయ దుమారానికి కారణమవుతోంది. తాజాగా సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా చేసిన వ్యాఖ్యలు బిజెపి నేత కిషన్ రెడ్డి ని షాక్ కు గురిచేశాయి.2014 ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందంటూ అమెరికన్ సైబర్ నిపుణుడు సయ్యద్ సుజా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈవీఎంల కు సంబంధించిన సిగ్నల్ హైదరాబాద్ కేంద్రంగా వచ్చినట్లుగా గుర్తించినట్లు చెప్పిన షుజా ఈ వ్యవహారంలో కిషన్ రెడ్డి పేరు ప్రస్తావించడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఇక దీంతో తెలంగాణ బీజేపీ కీలక రాజకీయనేతగా పేరున్న కిషన్ రెడ్డి ఇరకాటంలో పడ్డారా..? సయ్యద్ షుజా చేసిన ఆరోపణలతో కిషన్ రెడ్డికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయా..? ఈవీఎంల ట్యాంపరింగ్, 11 మంది హత్యకి సంబంధించిన వ్యవహారంలో కిషన్ పేరు రాడానికి కారణం ఏంటి..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
తెలంగాణ బీజేపీ లో మంచి వ్యక్తిగా,సున్నితమైన మనస్తత్వం ఉన్న రాజకీయనాయుకుడిగా, వివాదరహితుడిగా బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డికి పేరుంది. అయితే తాజాగా ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంలో సయ్యద్ షుజా కిషన్ రెడ్డి పేరు ప్రస్తావించడం సంచలనం రేపుతోంది. 2014 ఎన్నికల్లో ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌లో కిషన్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు చేయడంతో ఆయన ఇరకాటంలో పడ్డాడు. ట్యాంపరింగ్ తో పాటు 11 మంది హత్యలతో కిషన్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు చేశాడు దీంతో ఈ విషయాలను కిషన్ సీరియస్ గా తీసుకున్నారు. అయితే సయ్యద్‌ షుజా చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని అన్నారు. ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ నాయకుడు కపిల్‌ సిబల్‌, హ్యాకర్‌ సయ్యద్‌ షుజాలపై డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కుట్రపూరితంగా రాహుల్‌ గాంధీ, సిబల్‌, షుజా ఈ ఆరోపణలు చేశారని కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్‌ నేత కపిల్ సిబల్‌ సమక్షంలోనే షుజా మాట్లాడారని, ఈవీఎంల్లో లోపాలు ఉంటే రుజువు చేయాలని ఆయన సవాల్ చేశారు. కాకిరెడ్డి అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 11 మందిని హత్య చేయిస్తే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి తాజా వ్యవహారంతో కిషన్ రెడ్డి పేరు చర్చనీయాంశంగా మారింది. ఇక దీనిపై కిషన్ రెడ్డి డీజీపీ కి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులైన కపిల్ సిబాల్ పైన, సయ్యద్ షుజా పైన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కిషన్ రెడ్డికి తాజా వ్యవహారం రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులకు కారణం అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఈవీఎంలు సేఫ్ కాదు, గత ఎన్నికల్లోనే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని వస్తున్న ఆరోపణల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని కిషన్ రెడ్డి ఆరోపిస్తుంటే, ఈవీఎంలు ట్యాంపరింగ్ అంశాన్ని ప్రధానంగా తీసుకుని దేశవ్యాప్త ఆందోళన చేయాలని బీజేపీయేతర కూటమి నేతలు భావిస్తున్న పరిస్థితి ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article