కేబినెట్ లో చోటు దక్కేది వీరికే..?

T CABINET ALMOST FINAL

  • తుది జాబితా ఖరారు చేసిన సీఎం కేసీఆర్
  • కేటీఆర్, హరీశ్ లకు బెర్త్ లేనట్టే

తెలంగాణ మంత్రిమండలి విస్తరణ దాదాపు కొలిక్కి వచ్చింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం ప్రస్తుతానికి తొమ్మిది మందిని కేబినెట్ లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావులకు ప్రస్తుత విస్తరణలో అవకాశం లేనట్టేనని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్, హరీశ్ లకు ప్రచార బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాతే వీరిని కేటినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు, అనంతర పరిణామాలను బట్టి కేటీఆర్ కు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. కాగా, ప్రస్తుత విస్తరణలో ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లతోపాటు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్ లకు అవకాశం దక్కనున్నట్టు సమాచారం. వీరి ఎంపికకు సంబంధించిన సమాచారాన్ని సీఎం కేసీఆర్ ఇప్పటికే వారికి ఫోన్ ద్వారా తెలియజేశారు. చివరి క్షణంలో మార్పులు ఏవైనా లేకుంటే, దాదాపు ఇదే జాబితా ఖరారు అవుతుంది.

TS POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article