పట్టణాలకూ టీ ఫైబర్ విస్తరణ

T Fiber Expand To Cities

ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్  పరిధిని తెలంగాణలోని అన్ని మునిసిపాలిటీకు వర్తించేలా విస్తరించాలని ఐటి శాఖా మంత్రి మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి కేటీఆర్ సూచించారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ బోర్డ్ మీటింగ్ గురువారం టీ-హబ్ లో జరిగింది. ఈ బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు.   ఇప్పటికే ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఇవ్వాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. ఫైబర్ గ్రిడ్ పనుల పురోగతిని ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పనులు పూర్తయిన గ్రామీణ ప్రాంతాల్లో టిఫైబర్ పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని, ఈ సంవత్సరంలో అగస్టు నాటికి ప్రతి గ్రామానికి టి-ఫైబర్ కనెక్టివిటి అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని టిఫైబర్ అధికారులు మంత్రికి తెలిపారు.

మంత్రి కెటియార్ అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు జూన్ నుండి ప్రాధాన్యత క్రమంలో కనెక్ట్ చేయాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సూచన మేరకు రాష్ర్టంలోని అన్ని రైతు వేధికలను టిఫైబర్ తో కనెక్ట్ చేయాలని సూచించారు. తద్వారా ప్రతి రైతుకి ఇంటర్నెట్ ఫలాలు అందించే వీలుకుగుతుందన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 5 రైతు వేదికలకు కనెక్టివిటీని అందించామని టి – ఫైబర్ టీం మంత్రికి  తెలిపారు. బ్రాడ్ బ్యాండ్ సౌకర్యాన్ని ఒక యుటిలిటీగా పరిగణించే అంశాన్ని పరిశీలించి, దాని  ద్వారా తెలంగాణ లోని పట్టణాల్లోని ప్రతి ఇంటికి బ్రాడ్ బ్యాండ్ చేరుకునే విధానాన్ని అధ్యయనం చేయమని మంత్రి కెటియార్ అధికారులను ఆదేశించారు. బోర్డు అదేశాల మేరకు టిఫైబర్ ను మరింత వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేస్తామని, ప్రాజెక్టు పురోగతికి ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు సహకారం అందిస్తున్న మంత్రి కెటియార్ కి అయన దన్యవాదాలు తెలిపారు.ఈ సమావేశంలో  మంత్రి రామారావుతోపాటు ఐటి శాఖా ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అర్ధిక శాఖా ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రాస్ , మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపకర్ రెడ్డి మరియు టి-ఫైబర్ యండి. సుజాయ్ కారంపురి పాల్గొన్నారు.

Telangana Latest News

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article